News26th Aug 04:39 PMSunil Byrisetty1 min read
కలకత్తా ఆంధ్ర సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలు
కలకత్తా ఆంధ్ర సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలను సెప్టెంబర్ 12న అత్యంత భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తెలుగు సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని సంఘం తెలి
కలకత్తా ఆంధ్ర సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలను సెప్టెంబర్ 12న అత్యంత భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తెలుగు సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని సంఘం తెలిపింది. బెంగాల్‌లోని వివిధ తెలుగు సంస్థలను, ముఖ్యంగా ఖరగ్‌పూర్‌లోని తెలుగు సంస్థలు, ఐఐటి ఆచార్యులు, ఇతర ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు వేదుల సాయి శ్రీనివాస్, వింజమూరి బాలమురళి తెలిపారు. ఖరగ్‌పూర్ ప్రవాసాంధ్ర నవ్య కళాపరిషత్ సంస్థకు స్వయంగా వచ్చి ఆహ్వాన పత్రం అందజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, ప్రవాసాంధ్రుల మధ్య ఐక్యతను పెంపొందించే దిశగా ఈ వార్షికోత్సవాలు జరుగుతాయని వారు వివరించారు.