News7th Apr 11:45 AMSunil Byrisetty1 min read
మంగళగిరిని దేశంలో నెం.1 చేస్తా!
మంగళగిరిని భారతదేశంలో నెం.1 నియోజకవర్గంగా చేసే బాధ్యత తీసుకుంటానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంట
మంగళగిరిని భారతదేశంలో నెం.1 నియోజకవర్గంగా చేసే బాధ్యత తీసుకుంటానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు.
’మన ఇల్లు – మన లోకేష్‘ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్‌కి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డానన్నారు.
నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదని, మీ సమస్యలు తెలుసుకోలేకపోవడం, కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు రావడంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు.
ఓడిన రోజు కొంచెం బాధ పడ్డానని. రెండోరోజు నుంచి కసి పెరిగిందని చెప్పారు.
మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
అయిదేళ్లపాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, సొంతగా 26 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశానని చెప్పారు.