News1st Apr 03:13 PMSunil Byrisetty1 min read

మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్న లోకేష్

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పేదల దశాబ్ధాల నాటి కల ఇన్నాళ్లకు తీరనుంది. నియోజకవర్గం పరిధిలో అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు మన ఇల్లు-మన లోకేష్

మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్న లోకేష్
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పేదల దశాబ్ధాల నాటి కల ఇన్నాళ్లకు తీరనుంది. నియోజకవర్గం పరిధిలో అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమం పేరుతో ఈనెల 4వ తేదీ నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. తొలి విడతగా నియోజకవర్గ పరిధిలోని మూడువేల మంది పేదలకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను, నూతన వస్త్రాలను అందిస్తారు. మంగళగిరి -తాడేపల్లి కార్పొరేషన్ పరిధి యర్రబాలెం డాన్ బాస్కో పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు ఆవల రవికిరణ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడుతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. కాగా ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన మంత్రి నారా లోకేష్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ ఇచ్చిన మంగళగిరి ప్రజల రుణాన్ని తీర్చుకోనున్నారు.
Andhra Pradesh News
Mangalgiri
Nara Lokesh
Lands
Scroll for the next article