News13th Nov 04:12 PMSunil Byrisetty1 min read

రేపటి నుంచి మంగళగిరి–తాడేపల్లి ఎన్నికల నామినేషన్లు

మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్‌, డివిజన్లలో కార్పొరేటర్ ఎన్నికలకు ఈ నెల 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం

రేపటి నుంచి మంగళగిరి–తాడేపల్లి ఎన్నికల నామినేషన్లు
మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్‌, డివిజన్లలో కార్పొరేటర్ ఎన్నికలకు ఈ నెల 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గడువులకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్‌ చెప్పారు. ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 17న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. 19న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత నమూనాలో నామినేషన్‌ పత్రాలను పూర్తి చేసి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత రిటర్నింగ్‌ అధికారి లేదా సహాయ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలని కమిషనర్‌ సూచించారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయాలతో పాటు మంగళగిరి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను కేటాయించారు.
Scroll for the next article