News2nd Jun 09:53 AMSunil Byrisetty1 min read
భారత్ బంద్ 10న!
మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించింది. ఇటీవల 27మంది మావోయిస్టుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. జూన్ 11వ తేదీ నుంచి
మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించింది. ఇటీవల 27మంది మావోయిస్టుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటనలో 2024 నుండి 540 మంది మావోయిస్టులు మరణించారని తెలిపింది. చర్చలకు సిద్ధమని చెప్పినా ఆపరేషన్ కగార్ ఆపడం లేదని ఆరోపించింది. అయితే మావోయిస్టు సంఘం నేతల ప్రకటనపై ప్రభుత్వాలు స్పందించలేదు.