National21st May 02:00 PMSunil Byrisetty1 min read

చంద్రబాబుపై దాడి సూత్ర ధారి.. ఎన్‌కౌంటర్లో హతం?

మావోయిస్టు అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్ర ధారి.. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు ఉన్నారు. అలిపిరిలో చం

చంద్రబాబుపై దాడి సూత్ర ధారి.. ఎన్‌కౌంటర్లో హతం?
మావోయిస్టు అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్ర ధారి.. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు ఉన్నారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడికి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు అని చెబుతారు. తాజాగా అడవుల్లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతి చెందాడని సమాచారం. 2010లో CRPF జవాన్లపై జరిగిన దాడి వెనుక మాస్టర్ మైండ్ కూడా కేశవరావు అని పోలీసులు గుర్తించారు. ఆ దాడిలో 72మంది జవాన్లు అసువులు బాసారు. వరంగల్ RECలో MTech చేస్తున్న సమయంలో అప్పటి నక్సల్‌బరి ఉద్యమానికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరిన నంబాల గెరిల్లా యుద్ధ వ్యవహారాల్లో నిపుణుడు. ఆపరేషన్ కగార్ కింద కూంబింగ్ చేస్తున్న బలగాలతో ఎన్ కౌంటర్లో ఆయన మరణించినట్లు తెలుస్తోంది
Chattishgarh
Nambala Keshava Rao
Maoist Leader
Encounter
అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్ర ధారి
ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతి
Scroll for the next article