National17th Sep 11:54 AMSunil Byrisetty1 min read
ఆయుధాలకు దూరంగా మావోయిస్టులు?
ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యం
ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని పేర్కొన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అనేకమార్లు ప్రకటిం చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. దీంతో వారు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.