National15th Oct 12:06 PMSunil Byrisetty1 min read
మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల.. మావోలకు షాక్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట మావోయిస్ట్ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. గడ్చిరోలిలో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. దీంతో మ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట మావోయిస్ట్ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. గడ్చిరోలిలో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు గట్టి సాక్ తగిలినట్లయింది. ముఖ్యమంత్రికి ఒక్కొక్కరిగా వచ్చి ఆయుధాలు అందజేశారు. ఇటీవల కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. 2026 మార్చి నాటికి మావోలు లేని దేశంగా మారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో చేసేదేమీలేక 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి మల్లోజుల వేణుగోపాల్ తెర దించారు. జనజీవనసవ్రంతిలో కలిసి పోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 60 మంది సభ్యులతో కలిసి లొంగిపోయారు. మల్లోజులపై మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణలో అనేక కేసులు ఉన్నాయి. 100కు పైగా కేసులు ఉన్నాయి. మావోయిజంలో మల్లోజులది 44 ఏళ్ల ప్రస్థానం. ఇతడిపై రూ.6 కోట్ల రివార్డు ఉంది. ఆయుధాలను అప్పగించడంతో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వారికి రివార్డు ప్రకటించారు.