News28th Nov 11:23 AMSunil Byrisetty1 min read
ఆయుధాలు వీడనున్న మావోలు
మావోయిస్టులు ఆయుధాలను వీడనున్నారు, సాయుధ విరమణపై కీలక ప్రకటన చేశారు. జనవరి 1న సాయుధ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా ప
మావోయిస్టులు ఆయుధాలను వీడనున్నారు, సాయుధ విరమణపై కీలక ప్రకటన చేశారు. జనవరి 1న సాయుధ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నకేంద్ర ప్రభుత్వం.. 'ఆపరేషన్ కగార్' పేరుతో వరుసగా మావోయిస్టులను ఏరివేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా మారే అవకాశం ఉంది. ఇటీవల పలు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మరణించిన విషయం తెలిసిందే. దీంతో వందలాదిగా మావోలు లొంగిపోతున్నారు.