News25th Jul 12:20 PMSunil Byrisetty1 min read
భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు..
మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సు
మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో 185 మంది హతమయ్యారన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.