News3rd Oct 12:08 PMSunil Byrisetty1 min read

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో ఏకంగా 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 49 మందిపై కలిపి రూ.1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర

భారీగా మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో ఏకంగా 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 49 మందిపై కలిపి రూ.1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి, అంతర్గత కలహాలే కారణమని ఎస్పీ జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఒక్కరోజులో ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం ఇదే మొదటిసారి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం రూ.50వేలు చొప్పున సాయం అందించింది. లొంగిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోలు ఉన్నట్లు తెలుస్తోంది.
Chhattisgarh
Maoists surrender
Bijapur district
Left-wing extremism
Police action
Rewarded Maoists
Government rehabilitation
మావోయిస్టు ఉద్యమం
భారీ లొంగుబాటు
పోలీసుల చర్య
Scroll for the next article