National5th Dec 12:26 PMSunil Byrisetty1 min read

హిడ్మా ఎన్‌కౌంటర్ ఒక బూటకం?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. ఆ ఎన్‌కౌంటర్ ఒక బూటకమంటూ పేర్కొంది, మావోయిస్టు వికాల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదల చేసింద

హిడ్మా ఎన్‌కౌంటర్ ఒక బూటకం?
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. ఆ ఎన్‌కౌంటర్ ఒక బూటకమంటూ పేర్కొంది, మావోయిస్టు వికాల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మా గురించి దేవ్ జీ సమాచారం ఇచ్చాడని పోలీసులు చెప్తున్నది అవాస్తవమని.. అగ్రనేతలు దేవ్ జీ, రాజారెడ్డి మాతోనే ఉన్నారని పేర్కొంది. కలప వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో, చికిత్స కోసం విజయవాడ వచ్చిన హిడ్మాను పోలీసులు సజీవంగా పట్టుకున్నారని ఆరోపించింది. మారేడుమిల్లిలో హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్తున్నది ముమ్మాటికి అవాస్తవమని లేఖలో స్పష్టం చేసింది.
Hidma
Maoists
Encounter Row
Chhattisgarh News
Police vs Maoists
పోలీసుల ఆరోపణలు
మారేడుమిల్లి
నక్సల్ కార్యకలాపాలు
అగ్రనేతల ప్రకటన
Scroll for the next article