News24th Nov 01:13 PMSunil Byrisetty1 min read
సమయమివ్వండి.. ఆయుధాలు వీడతాం!
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ మూడు రాష
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ మూడు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్(ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది. “దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం.
ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు మాకు కొంత సమయం పడుతుంది. సహచరులను సంప్రదించి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలి. భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలి. పీఎల్డీఏ వారోత్సవాన్ని నిర్వహించబోం. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాం”అని లేఖలో పేర్కొన్నారు.