News8th Oct 04:20 PMSunil Byrisetty1 min read

ఎయిడ్స్ అవగాహన కోసం మారథాన్!

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) వారి ఆధ్వర్యంలో 2026 మారథాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతతో పాటు ప్రజల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధ

ఎయిడ్స్ అవగాహన కోసం మారథాన్!
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) వారి ఆధ్వర్యంలో 2026 మారథాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతతో పాటు ప్రజల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రాజెక్ట్ డైరెక్టర్ B. స్మరణ రాజ్ తెలియజేశారు. హెచ్ఐవి తో ఉన్నవారిపై సమాజంలో వివక్ష చూపకూడదని తెలిపారు. యువతను భాగస్వామ్యంతో హెచ్ఐవి బారిన పడకుండా సమాజంలో రిస్క్ ని తగ్గించాలనే ఉద్దేశంతో అవగాహన పెంచుకోవాలని సూచించడం జరిగింది. ఈ రెడ్ రన్ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరిగిందన్నారు. గెలుపొందిన మొదటి, రెండవ, మూడవ వ్యక్తులతో రాష్ట్రస్థాయి మారథాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారిలో మొదటి రెండవ మూడవ బహుమతుల్లో వీరిని రీజనల్ స్థాయి మారథాన్ కి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Scroll for the next article