News4th Dec 11:57 AMSunil Byrisetty1 min read

పాఠశాల రికార్డుల్లో తప్పుల సవరణకు మార్చి 31 గడువు

పాఠశాలల్లోని రికార్డులను సవరించే అధికారాన్ని మండల, డిప్యూటీ విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు గేడ్-2లకు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు

పాఠశాల రికార్డుల్లో తప్పుల సవరణకు మార్చి 31 గడువు
పాఠశాలల్లోని రికార్డులను సవరించే అధికారాన్ని మండల, డిప్యూటీ విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు గేడ్-2లకు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ అవకాశం కల్పించింది. అపార్ ఐడీల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రికార్డుల్లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇంటి పేరు, విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, ఇతర వివరాలు ఆధార్ సరిపోలకపోవడంతో అపార్ ఐడీ కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పాఠశాల రికార్డులను సవరించేందుకు ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, హెచ్ఎంలకు పాఠశాల విద్యాశాఖ అధికారం కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈఓ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు, ఎయిడెడ్, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు డిప్యూటీ విద్యాధికారికి ఈ అధికారాలు కల్పించింది.
Andhra Pradesh Schools
School Records
March 31 Deadline
Education Department Orders
Student Aadhar Issues
APAR ID
MEO
Deputy EO
Headmasters
ప్రధానోపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు
రికార్డ్ సవరణ
విద్యా
Scroll for the next article