Politics16th Oct 06:06 PMSunil Byrisetty1 min read
ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి ఆశలు ఆవిరి
సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ టికెట్‌ను బీసీ మహిళకు కేటాయించడంతో.. తన ప్రేయసి మంజీరను టీడీపీ నేత హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్
సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ టికెట్‌ను బీసీ మహిళకు కేటాయించడంతో.. తన ప్రేయసి మంజీరను టీడీపీ నేత హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను పెళ్లి చేసుకుంటే భార్యకు పార్టీ టికెట్ వస్తుందన్న ఉద్దేశంతో వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఎవరినీ పిలవకుండా గుడిలో హడావుడిగా హర్షవర్ధన్ పెళ్లి చేసేసుకున్నాడు. కానీ.. కూటమి సీట్ల సర్దుబాటులో సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం జనసేన పార్టీకి వెళ్లింది. దీంతో హర్షవర్ధన్ ఆశలు పూర్తిగా ఆవిరి అయిపోయాయి. నిజానికి.. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న హర్షవర్ధన్, మంజీర మరో ఆరు నెలల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం ముహూర్తాలు కూడా చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే, చివరికి నిరాశే మిగిలింది.