News30th Nov 03:33 PMSunil Byrisetty1 min read
5 వేల ప్రాంతాల్లో సామూహిక మన్ కీ బాత్ వీక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా అయిదువేల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో సామూహిక మన్ కీ బాత్ వీక్షణ కార్యక్రమాలు కొనసాగాయి. పోలింగ్ బూత్ స్థాయి, మండల స్థాయి లో క్షేత్ర స్థాయి బి
రాష్ట్ర వ్యాప్తంగా అయిదువేల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో సామూహిక మన్ కీ బాత్ వీక్షణ కార్యక్రమాలు కొనసాగాయి. పోలింగ్ బూత్ స్థాయి, మండల స్థాయి లో క్షేత్ర స్థాయి బిజేపి శ్రేణులు మన్ కీ బాత్ ను చూశారు. కోనసీమ జిల్లా తాపేశ్వరంలో వేదిక ఫంక్షన్ హల్ లో “మన్ కీ బాత్” కార్యక్రమoలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో కలసి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వీక్షించారు. బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణుల ప్రతిభను దేశవ్యాప్తం చేసిన విషయాన్ని వివరించారు. తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతపై ప్రశంసలు కురిపించారన్నారు. నవంబర్ నెలలో జరిగిన పలు స్ఫూర్తిమంతమైన ఘటనల గురించి కూడా ప్రధాని పంచుకున్న విషయాన్ని మాధవ్ ఈ సందర్భంగా ఉటంకించారు. క్రీడా రంగం, వ్యవసాయ రంగం గురించి ప్రధాని ప్రస్తావించి న విషయాన్ని గుర్తు చేశారు.