News6th Aug 04:31 PMSunil Byrisetty1 min read
ఆర్టీసీ స్థలాన్ని లూలూకు కట్టబెట్టొద్దు
విజయవాడ పాత బస్టాండ్‌కు సంబంధించిన 4.17ఎకరాల రూ. 400 కోట్లు విలువ చేసే స్థలాన్ని లూలూ బహుళజాతి సంస్థకు దారాదత్తం చేస్తూ విడుదల చేసిన జీఓ 137ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసి
విజయవాడ పాత బస్టాండ్‌కు సంబంధించిన 4.17ఎకరాల రూ. 400 కోట్లు విలువ చేసే స్థలాన్ని లూలూ బహుళజాతి సంస్థకు దారాదత్తం చేస్తూ విడుదల చేసిన జీఓ 137ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసి స్థలాల పరిరక్షణా కమిటీ నాయకులు ఉద్యమించారు. ఆర్టీసి స్థలాల పరిరక్షణా కమిటీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆర్టీసి , ఇతర కార్మిక సంఘాలు, పురప్రముఖులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ఇతర సంస్థల నాయకులు కార్యకర్తలు, పౌరసంక్షేమ సంఘం నాయకులు, వామపక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీఓ నెంబర్ 137ను రద్దు చేయాలని, ఆర్టీసి స్థలాలను పరిరక్షించాలని, లూలూ మాల్‌కు ఇవ్వడాన్ని ప్రతిఘటించాలని, కూటమి ప్రభుత్వ భూ దాహాన్ని నిలువరిద్దామని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్టీసి స్థలాల పరిరక్షణ కమిటీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, రైతు సంఘాల సమాఖ్య సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కోర్టులు, చట్టాలకు వ్యతిరేకంగా, ప్రజాభిప్రాయానికి భిన్నంగా లూలూ సంస్థకు పాతబస్టాండ్ విలువైన స్థలాన్ని దారాదత్తం చేస్తే కోర్టు కొట్టేయడం ఖాయమని తేల్చి చెప్పారు.