Jobs24th Nov 03:27 PMSunil Byrisetty1 min read

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఏకంగా లక్ష!

ఏపీలో ఖాళీగా ఉన్న లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరించిన ప్రభుత్వం.. మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఏకంగా లక్ష!
ఏపీలో ఖాళీగా ఉన్న లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరించిన ప్రభుత్వం.. మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది.ఈ వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయిస్తోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 శాతం మేర ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో మొత్తం 13 వేల ఖాళీలుండగా.. 4,787 ఖాళీలను అధికారులు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 వరకు పోస్టులు ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 7 వేల పోస్టులు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా, వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా, పంచాయతీరాజ్‌ శాఖలో 26 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదలైతే నిరుద్యోగులు పండుగ చేసుకోనున్నారు.
Andhra Pradesh Jobs
AP Government Recruitment
Job Calendar 2025
Vacancy Notification
Government Employment News
Job Openings
Recruitment Drive
Scroll for the next article