Politics4th Jun 06:23 PMSunil Byrisetty1 min read

మంగళగిరిలో వైసీపీ వెన్నుపోటు దినం

మంగళగిరి బస్టాండ్ సెంటర్ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ

మంగళగిరిలో వైసీపీ వెన్నుపోటు దినం
మంగళగిరి బస్టాండ్ సెంటర్ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లిన వైసీపీ నేతలు మంగళగిరి డిప్యూటీ తాసిల్దార్ అంకారావుకు వినతిపత్రం అందించారు. వేమారెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుతున్నామన్నారు. ఈ వెన్నుపోటు దినం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు రాజకీయ జీవితం ఎన్టీఆర్ వెన్నుపోటుతో ప్రారంభమై ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచే స్థాయికి చంద్రబాబు వచ్చారని విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆ రోజు నుండి ఈరోజు వరకు నాయకులను, కార్యకర్తలను వెన్నుపోటు పొడుస్తూ చివరికి ప్రజలను సైతం వెన్నుపోటు పొడిచే స్థాయికి చంద్రబాబు దిగజారారని ఆరోపించారు.
Andhra Pradesh news
AP Politics
Mangalagiri
vennupotu dinam
chandra babu promises
tdp govt failure
మంగళగిరిలో వైసీపీ వెన్నుపోటు దినం
వైఎస్ జగన్
Scroll for the next article