Spiritual11th Sep 11:46 AMSunil Byrisetty1 min read
సింహాచలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండు, మూడు, వేదికలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను దేవస్థానం ఘనంగా ప్ర
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండు, మూడు, వేదికలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను దేవస్థానం ఘనంగా ప్రారంభించింది. వేద పండితులు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చారణల నడుమ రెండో వేదికలో వ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో మహిళా భక్తులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరలక్ష్మీ వ్రత విశిష్టతను, పూజా విధానాన్ని మహిళా భక్తులకు ప్రధాన అర్చకులు వివరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో సింహాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల సౌకర్యార్థం వేదికలు, సమయాలను కేటాయించి ఎస్‌ఎంఎస్ ద్వారా ముందుగానే సమాచారం అందించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో సింహాచల క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొంటున్న మహిళా భక్తులు.. శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు.