News29th Apr 01:24 PMSunil Byrisetty1 min read

గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) వారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్

గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) వారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించే నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు, జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీతో కలిసి సమీక్షించారు. వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నప్పటికీ ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే నేపథ్యంలో ఇక్కడే భద్రత ఏర్పాట్ల గూర్చి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. క్షిపణి పరిశోధనా కేంద్రాన్ని కృష్ణాజిల్లాలో ప్రారంభించడం దేశానికే తలమానికమన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాకు గర్వకారణంగా ఉండేలా అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Gullalamoda Missile Testing Center
DRDO
PM MODI
Amaravati
ఎస్పీ ఆర్.గంగాధరరావు
వర్చువల్ విధానం
క్షిపణి పరిశోధనా కేంద్రాన్ని కృష్ణాజిల్లా
డీ.కే. బాలాజీ
Scroll for the next article