News26th May 12:14 PMSunil Byrisetty1 min read
మహానాడు కోసం పార పట్టిన మంత్రి
కడపలో మహానాడు ప్రాంగణం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పార పట్టుకుని స్వయంగా మట్టి పని చేశారు. కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపేలా అన్ని పనుల్లో భాగం పంచుకుంటున్నారు
కడపలో మహానాడు ప్రాంగణం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పార పట్టుకుని స్వయంగా మట్టి పని చేశారు.
కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపేలా అన్ని పనుల్లో భాగం పంచుకుంటున్నారు.
కడపలో తొలిసారిగా పసుపు పండుగ మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్షన్నర మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు.
27, 28, 29 తేదీల్లో నిర్వహించే ఈ పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది.
మంత్రి నిమ్మల సహా మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు నిత్యం అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు