Entertainment10th Nov 02:12 PMSunil Byrisetty1 min read
రాజమౌళి–మహేశ్ సినిమాపై భారీ బిజినెస్ టాక్
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.290 కోట్లకు దక్కించుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భారీ డీల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమాలో త్రేతాయుగం నేపథ్యంలో రామాయణ ఘట్టాలు కూడా ఉంటాయని రాజమౌళి వెల్లడించారు. ఇందులో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలోనూ కనిపించనున్నారు.