News30th Oct 08:41 AMSunil Byrisetty1 min read
మొంథా తుఫానుతో అపార నష్టం
మొంథా తుఫాను వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగినట్లు అధికారులు లెక్క తేల్చారు. 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు గుర్తించారు. తుపాను వల్ల 90 వేల ఎకరాల్లో వరి,
మొంథా తుఫాను వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగినట్లు అధికారులు లెక్క తేల్చారు. 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు గుర్తించారు. తుపాను వల్ల 90 వేల ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. తుపాను వల్ల 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగింది. అలాగే సుమారు 75 వేల మంది రైతులకు నష్టం వాటిల్లిందని సమాచారం. మొత్తం 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. తుపాను వల్ల సుమారు 1800 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. ఆర్ అండ్ బీకి రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం జరిగిందని అంచనా వేశారు. విద్యుత్, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు తీవ్ర నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.