News27th Jul 04:15 PMSunil Byrisetty1 min read
మరో భారీ ఎన్ కౌంటర్!
చత్తీస్ ఘడ్,బీజపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. బీజపూర్ జిల్లా సౌత్ వెస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గా
చత్తీస్ ఘడ్,బీజపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. బీజపూర్ జిల్లా సౌత్ వెస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు.