Telangana30th Jun 03:33 PMSunil Byrisetty1 min read

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్ రూరల్ పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 20 మంది కార్మికుల

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం
హైదరాబాద్ రూరల్ పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, కార్మికులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలికి వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ చేరుకుని పరిశీలించారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Telangana News
patancheru
Fire accident
CM revanth reddy
Chemical Factory
sanga reddy
సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
Scroll for the next article