Telangana8th Nov 05:59 PMSunil Byrisetty1 min read

క్రాకర్స్ షాపులో పేలుళ్లు.. మాడి మసే!

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ప్రాంతంలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎవరో కాల్చిన రాకెట్ నేరుగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ

క్రాకర్స్ షాపులో పేలుళ్లు.. మాడి మసే!
సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ప్రాంతంలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎవరో కాల్చిన రాకెట్ నేరుగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. రాకెట్ దుకాణంలో పడగానే లోపల ఉన్న బాణసంచా ఒక్కసారిగా పేలిపోవడం ప్రారంభమైంది. వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుళ్ల శబ్దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. దుకాణం సమీపంలో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొంతసేపు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే దుకాణంలోని బాణసంచా మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది.
Scroll for the next article