News25th Jan 12:34 PMSunil Byrisetty1 min read
కూలీ ఇంట్లో కోటిన్నర బంగారం!
కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల న
కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడింది. తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎస్పీ వకుల్ జిందాల్‌కు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం వచ్చింది. వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు భారీగా నగదు వెలుగు చూసింది.