News15th Nov 09:27 AMSunil Byrisetty1 min read

సీఐఐ సమ్మిట్‌లో పెట్టుబడులు.. బాబే బ్రాండ్!

విశాఖలో జరుగుతున్న రెండు రోజుల సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పెట్టుబడుల ఒప్పందాలు భారీగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. ఆయన్ను క

సీఐఐ సమ్మిట్‌లో పెట్టుబడులు.. బాబే బ్రాండ్!
విశాఖలో జరుగుతున్న రెండు రోజుల సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పెట్టుబడుల ఒప్పందాలు భారీగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. ఆయన్ను కలిసి మాట్లాడేందుకే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజనరీ ఆలోచనలు.. తమ వ్యాపారాలకూ ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. అందుకే పెట్టుబడుల సమ్మిట్ కు వచ్చి అక్కడ జరుగుతున్న ప్యానల్ డిస్కషన్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రబాబుకు పారిశ్రామిక వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదటి సారి సీఎం అయినప్పటి నుండి పెట్టుబడులు, పరిశ్రమలు, స్కిల్, ఉపాధి అంటూ ఆయన చేసిన ప్రయత్నాలు, ఇచ్చిన సలహాలతో ఎన్నో దిగ్గజ కంపెనీలు విస్తరించాయి. రిలయన్స్ గ్రూపు టెలికాంలోకి రావడానికి కూడా చంద్రబాబు సలహానేనని చాలా సార్లు చెప్పారు కూడా. భవిష్యత్ అవసరాలను గుర్తించి.. దానికి తగ్గట్లుగా పెట్టుబడుల్ని సజెస్ట్ చేయడంలో ఆయన ముందు ఉంటారు. అలాంటి ఐడియాల కోసం పెట్టుబడిదారులు కూడా ఎదురు చూస్తూంటారు.
Andhra Pradesh
CII Summit
investments
ap brand ambassador
Chandrababu Naidu
AP Development
Industry Growth
Business Summit
బిజినెస్ సమ్మిట్
విశాఖపట్నం
పెట్టుబడి ఒప్పందాలు
ఆర్థిక పురోగతి
Scroll for the next article