News13th Nov 11:51 AMSunil Byrisetty1 min read
రాజధానిలో భారీగా భూ కేటాయింపులు
రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా 11 సంస్థలకు భూములు కేటాయించారు. ఈ మేరకు బుధవారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో బాసిల్ ఉడ్ ఇంటర్
రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా 11 సంస్థలకు భూములు కేటాయించారు. ఈ మేరకు బుధవారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో బాసిల్ ఉడ్ ఇంటర్నేషన్ స్కూల్‌కు నాలుగు ఎకరాలు ఎకరా రూ.50 లక్షల చొప్పున ఫ్రీ హోల్డ్ పద్ధతిలో కేటాయించారు. శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్‌కు 7.97 ఎకరాలు ఎకరా రూ.50 లక్షల చొప్పున ఫ్రీహోల్డ్‌లో ఇచ్చారు. సిఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌కు 15 ఎకరాలు 60 సంవత్సరాల లీజుకు ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె కేటాయిస్తూ కేటాయింపులు జరిపారు. కాగ్‌కు 12 ఎకరాల భూమిని ఎకరా రూ.4.1 కోట్లకు కేటాయించారు. ఎన్‌టిపిసికి 1.50 ఎకరాలు ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె కేటాయించారు. జ్యుడీషియల్ అకాడమీకి 5 ఎకరాలు 60 ఏళ్లకు ఎకరానికి రూపాయి అద్దె చొప్పున లీజుకు ఇవ్వనున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 40 సెంట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 40 సెంట్లు, నేషనల్ కనస్ట్రక్షన్ అకాడమీకి ఐదు ఎకరాలు, ఐబిఐడికి 40 సెంట్లు, ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె నిర్ణయించారు. మొత్తం 49.50 ఎకరాలు కొత్తగా కేటాయింపులు జరిపారు.