Politics9th Mar 03:03 PMSunil Byrisetty1 min read

స్టీల్ ప్లాంట్లో సమ్మె? భారీగా కార్మికుల తొలగింపు

ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా పేరున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్

స్టీల్ ప్లాంట్లో సమ్మె? భారీగా కార్మికుల తొలగింపు
ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా పేరున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. దీంతో క్షణమైనా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. దీంతో నేడు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగియగా.. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్రం స్టీల్ ప్లాంటును ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించిందని ఇటీవల కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకుంది. ఇప్పుడు కార్మికుల తొలగింపుతో ప్రయివేటీకరణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
Visakhapatnam
Steel Plant
విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్
Scroll for the next article