News6th Sep 03:26 PMSunil Byrisetty1 min read
కొండపై ఎన్టీఆర్ భారీ విగ్రహం.. రెండేళ్ల గడువు!
రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలోని కొండపై దివంగత ఎన్టీఆర్ భారీ విగ్రహ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అలాగే 400 ఎకరాల్లో సువిశాల జలాశయాన్ని నిర్మిస్తూ కొండవీటి వాగు, పాలవాగు, శా
రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలోని కొండపై దివంగత ఎన్టీఆర్ భారీ విగ్రహ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అలాగే 400 ఎకరాల్లో సువిశాల జలాశయాన్ని నిర్మిస్తూ కొండవీటి వాగు, పాలవాగు, శాఖమూరు రిజర్వాయర్లతో అనుసంధానం చేసే పనులు చేపట్టనున్నారు. రాజధానికి వరద ముప్పు లేకుండా పటిష్టమైన గ్రీన్ అండ్ బ్లూ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక ట్రాక్ ట్రైన్స్, లిఫ్ట్‌లు, జలాశయంలో వాటర్ టాక్సీలను రెండేళ్లలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన విధంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్ల ఖరారు, నిధుల సమీకరణ, సాంకేతిక అధ్యయనాలను ప్రభుత్వం శరవేగంగా కొలిక్కి తీసుకువస్తోంది. కొద్ది వారాల్లో టెండర్ల ప్రక్రియను ఎం పూర్తి చేసి భూమిపూజ చేయాలని భావిస్తోంది.