Spiritual15th Jan 10:46 AMSunil Byrisetty1 min read

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ ఏర్పాట్లన్నిటిపై నిత్యం ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడానికి మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా మంత్రి సీతక్క నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం, పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు. మోబైల్ నెట్ వర్క్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్దతిలో 33 మోబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు.
Medaram Jatara
Sammakka Saralamma
Maha Jatara 2026
Telangana Government
Tribal Festival
Minister Seethakka
Medaram Arrangements
Pilgrimage
పరిపాలనా చర్యలు
వాలంటీర్లు
భద్రతా ఏర్పాట్లు
మొబైల్ నెట్‌వర్క్
తెలంగాణ
Scroll for the next article