Education6th Nov 12:47 PMSunil Byrisetty1 min read
ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు.. త్వరలో భర్తీ
ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. సంస్థలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని పాలకమండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార
ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. సంస్థలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని పాలకమండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కొనకళ్ల నారాయణ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి అద్దె బస్సుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 200 అద్దె బస్సుల లీజు పరిమితిని పెంచి, యజమానులకు లబ్ధి చేకూర్చడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని ప్రస్తుత పాలక మండలి అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమీక్షించి, వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.