Politics24th Oct 12:35 PMSunil Byrisetty1 min read
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖల
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎంపీటీసీలకు 25,016, జడ్పీటీసీలకు 3,315 నామినేషన్లు ఫైల్ చేశారు. ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ నుంచి 22,013, వైసీపీ నుంచి 20,556 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీలకు జనసేన నుంచి 4,609, బీజేపీ తరఫున 1,150 నామినేషన్లు నమోదయ్యాయి. జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ నుంచి 2,078, వైసీపీ నుంచి 1,815 నామినేషన్లు ఫైల్ చేశారు. జడ్పీటీసీలకు జనసేన నుంచి 679, బీజేపీ నుంచి 255 నామినేషన్లు దాఖలయ్యాయి.