Jobs7th Aug 09:13 AMSunil Byrisetty1 min read

మెగా జాబ్ మేళాలో 508 మందికి ఉద్యోగాలు

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాల కోసం ద

 మెగా జాబ్ మేళాలో 508 మందికి ఉద్యోగాలు
మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరవ్వగా ప్రతిభ, అవగాహన సామర్థ్యం ఆధారంగా 508 మందికి ఉద్యోగాలు లభించాయి. నిరుద్యోగ యువతి, యువకుల కోసం డాటా ఎంట్రీ, బి.పి.ఓ, రిటైల్, ఈ కామర్స్, ఆటోమోటివ్, వైద్య ఫార్మసీ, ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, హీరో మోటర్స్, మాస్టర్ మైండ్స్, శ్రీరాం ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మెడ్ ప్లస్, సాప్ట్ వేర్, ముత్తూట్ ఫైనాన్స్ రంగాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకై మెగా జాబ్ మేళాను వీటిజేఎం & ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వారు, ఇంటర్‌, డిప్లమా, బి-ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. 38 పైగా కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాటి ఆధారంగా కంపెనీల్లో రూ.15వేల మొదలుకొని రూ.40 వేల వరకూ జీతం లభించే ఉద్యోగాలకు 508 మందిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
Andhra Pradesh
Mangalagiri
Mega Job Mela
Nara Lokesh
APSSDC
Youth Employment
Job Fair 2025
BPO Jobs
Data Entry
Pharma Jobs
IT Jobs
Skill Development
మెగా జాబ్ మేళాలో 508 మందికి ఉద్యోగాలు
Scroll for the next article