Spiritual27th Nov 01:39 PMSunil Byrisetty1 min read
33 రోజుల్లో.. శ్రీశైల మల్లన్నకు కళ్లు చెదిరే ఆదాయం
కార్తీక మాసంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగి, స్వామి–అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. త
కార్తీక మాసంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగి, స్వామి–అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. తాజాగా చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో మొత్తం రూ. 7,27,26,400 ఆదాయం నమోదైంది. అలాగే USA డాలర్లు – 646, సౌదీ రియాల్స్ – 85, యూఏఈ దిర్హమ్స్ – 120, కత్తర్ రియల్స్ – 136, సింగపూర్ డాలర్లు – 30, ఇంగ్లాండ్ పౌండ్స్ – 85, ఆస్ట్రేలియా డాలర్లు – 25, ఒమన్ బైంసా – 200లను భక్తులు హుండీలో వేశారు. ఇతర కానుకల్లో 117.800 గ్రాముల బంగారం, 7 కిలోలు 230 గ్రాముల వెండి కూడా ఉన్నాయి. ఇవన్నీ భక్తులు స్వామి–అమ్మవార్లకు పవిత్ర కానుకలుగా సమర్పించినవి. పటిష్ట నిఘా మధ్య, ఈవో శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శివసేవకులు పాల్గొన్నారు. శ్రీశైలం క్షేత్రంపై భక్తుల నమ్మకం, భక్తిశ్రద్ధకు మరోసారి మల్లన్న హుండీ సాక్ష్యంగా నిలిచింది.