News20th Aug 04:07 PMSunil Byrisetty1 min read

ఏడుగురు మత్స్యకారుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్

వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటులో చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం సమన్వయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆప

ఏడుగురు మత్స్యకారుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్
వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటులో చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం సమన్వయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా సముద్రం, గగనతలం నుంచి విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 3న ఏడుగురు మత్స్యకారులతో బోటు చేపల వేటకు వెళ్లిందని, నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 17 నుంచి భారత తీర రక్షక దళానికి చెందిన ఐదు నౌకలు గాలింపు చర్యల్లో పాల్గొంటుండగా, భారత నౌకాదళం మరో రెండు నౌకలను రంగంలోకి దించడంతో ప్రస్తుతం మొత్తం ఏడు నౌకలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. నేవీకి చెందిన ఒక నౌక విశాఖపట్నం నుంచి పారాదీప్ వైపు, మరో నౌక ఓడలరేవు వైపు గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
Andhra Pradesh
Missing Fishermen
Fishermen Search Operation
Search and Rescue
Indian Navy
Indian Coast Guard
కింజరాపు అచ్చెన్నాయుడు
వాడలరేవు
చేపల వేట బోటు
సముద్ర గాలింపు
విశాఖపట్నం
పారాదీప్
Scroll for the next article