Crime16th Oct 11:47 AMSunil Byrisetty1 min read
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం రేగింది. నగరంలోని ఎనీటైమ్ ఫిట్నెస్ సెంటర్‌లో పోలీసులు భారీగా స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రసూల్ అనే యువకుడు జిమ్‌కి వచ్చే యువతకు, నగరంలోని ప
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం రేగింది. నగరంలోని ఎనీటైమ్ ఫిట్నెస్ సెంటర్‌లో పోలీసులు భారీగా స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రసూల్ అనే యువకుడు జిమ్‌కి వచ్చే యువతకు, నగరంలోని పలు జిమ్‌లకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమీర్ అనే వ్యక్తితో కలిసి సునీల్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు తేలింది. ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సునీల్ కోసం గాలిస్తున్నారు.