News18th Aug 09:03 AMSunil Byrisetty1 min read

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. హైవేపై ట్రాఫిక్ జామ్!

విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఆదివారం ఇలా లాంగ్ వీకెండ్ రావడంతో హైదరాబాద్ నుంచి లక్షలాదిగా ఆంధ్రా వచ్చ

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. హైవేపై ట్రాఫిక్ జామ్!
విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఆదివారం ఇలా లాంగ్ వీకెండ్ రావడంతో హైదరాబాద్ నుంచి లక్షలాదిగా ఆంధ్రా వచ్చారు. 3 రోజుల వరుస సెలవుల అనంతరం తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పండుగలు, వీకెండ్ సెలవులు, భారీ వర్షాలు వల్ల టూర్లకు వెళ్లి, తిరిగి నగరానికి వచ్చే వాహనాలతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నల్గొండ జిల్లా పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
Andhra Pradesh
Vijayawada-Hyderabad highway
traffic jam
Independence Day rush
Sri Krishna Janmashtami
long weekend holidays
heavy rains
festival traffic
పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ
Scroll for the next article