News3rd Oct 12:16 PMSunil Byrisetty1 min read
భారీగా కూలిన చెట్లు.. యుద్ధప్రాతిపదికన పనులు
అల్పపీడనం కారణంగా విశాఖపట్నం నగరంలో ఈదురు గాలులు, వర్షాలు పడుతున్నాయి. దీంతో 80 ప్రాంతాల్లో 150 చెట్లు కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ, విద్యుత్, విపత్తు నిర్వహణ
అల్పపీడనం కారణంగా విశాఖపట్నం నగరంలో ఈదురు గాలులు, వర్షాలు పడుతున్నాయి. దీంతో 80 ప్రాంతాల్లో 150 చెట్లు కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ, విద్యుత్, విపత్తు నిర్వహణ సిబ్బంది శుక్రవారం ఉదయం చెట్లు తొలగించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విజయనగరం, మన్యం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి, రోడ్లపై చెట్లు పడడం వల్ల రాకపోకలకు అంతరాయం చోటుచేసుకుంది. కాగా, ప్రజలను గాలులు, వర్షాల సమయంలో బయటకు రావొద్దని అధికారులు సూచించారు.