Spiritual18th Aug 10:03 AMSunil Byrisetty1 min read
22న పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చివరి శ్రావణ శుక్రవారం శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చివరి శ్రావణ శుక్రవారం శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. వరలక్ష్మీ వ్రతాల సందర్భంగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పంపే పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందించనున్నట్టు చెప్పారు. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ కి ఎనలేని అభిమానం అని చెప్పారు. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం 5 బ్యాచులుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరు అంబికా, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేసి.. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహిస్తామని వివరించారు.