News2nd Aug 10:39 AMSunil Byrisetty1 min read

పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు సాస్కి పథకం కింద గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒ

పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు సాస్కి పథకం కింద గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు గండికోటలో ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందని అన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, ఆ తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా ఉందని స్పష్టం చేశారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శించిన వారికి మంచి అనుభూతి కలిగేలా రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రాండ్ కాన్యన్ ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలిరైడ్స్ కూడా సెప్టెంబరు నుంచి మొదలు అవుతాయన్నారు.
Andhra Pradesh Tourism
Gandikota
CM Chandrababu Naidu
Tourism Development
Grand Canyon of India
SASCI Scheme
Ropeway Project
Gandikota Utsav 2025
గండికోట
పర్యాటక అభివృద్ధి
Scroll for the next article