News9th Oct 04:59 PMSunil Byrisetty1 min read

మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలకు మాస్టర్ ప్లాన్

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218

మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలకు మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”రైతులకు లాభం రావాలి... వినియోగదారునికి ప్రయోజనం కలగాలి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి.” అని సీఎం ఆదేశించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Agriculture
Market Committees
Infrastructure Development
Farmers Welfare
PM Dhan Dhanya Krishi Yojana
ఖరీఫ్
రబీ
వ్యవసాయ సంస్కరణలు
Scroll for the next article