Spiritual3rd Aug 11:55 AMSunil Byrisetty1 min read

భవిష్యత్తుపై మాతంగి మాట

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత ఈసారి ఆగ్రహంగా మాట్లాడారు. తన మాట వినట్లేదని, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఆపదల్లో నేను

భవిష్యత్తుపై మాతంగి మాట
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత ఈసారి ఆగ్రహంగా మాట్లాడారు. తన మాట వినట్లేదని, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదం’టూ వ్యాఖ్యానించారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారని, ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడిగారు. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయి. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
Secunderabad
Telangana
Bonalu
Ujjaini Mahankali
Matangi Swarnalatha
Bonalu Festival
Heavy Rains
వరద హెచ్చరిక
ఆలయ ఉత్సవాలు
సంప్రదాయం
ఆధ్యాత్మికం
Scroll for the next article