Politics24th Aug 11:16 AMSunil Byrisetty1 min read
ఇంకా ప్రకటనే లేదు.. అప్పుడే కొట్లాటలు!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో కూటమి పార్టీల్లో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గ కూటమి రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. స్థానిక సంస్థల సీట్ల పంపిణీక
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో కూటమి పార్టీల్లో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గ కూటమి రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. స్థానిక సంస్థల సీట్ల పంపిణీకి సంబంధించి అధికార కూటమిలో ఒప్పందాలు కుదిరి, మచిలీపట్నం మేయర్ స్థానం జనసేన పార్టీకి ఖరారైందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, మేయర్ సీటు ఖరారుపై క్లారిటీ రాకముందే జనసేనలోని అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన నాయకులు నడిరోడ్డుపై, ప్రైవేట్ వేడుకల్లో దాడులకు తెగబడ్డాయి. ఇప్పుడీ వ్యవహారం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. జనసేన నేత బండి రామకృష్ణకే మేయర్ అని వారి అనుచరులు సంతకాల సేకరణ చేపట్టడంతో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మరో కీలక నేత కొట్టె వెంకట్రావు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటమాట పెరగడంతో ఇరువర్గాల నాయకులు తోపులాటకు, భౌతిక దాడులకు దిగారు.