News31st May 10:56 AMSunil Byrisetty1 min read
జగనే ఆదుకోవాలి: ఎండీయూ సంఘం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి అవకాశం కోల్పోయిన ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్)ల నిర్వాహకులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. జూన్ 1 నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్య
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి అవకాశం కోల్పోయిన ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్)ల నిర్వాహకులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. జూన్ 1 నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు స్వస్తి చెప్పాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 18 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళన చేస్తున్న ఎండీయూల యూనియన్ సభ్యులు, తమను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిసిన వినతి పత్రం ఇచ్చారు. ఈ వ్యవస్థ ఉపాధి కల్పించడమే కాకుండా.. దివ్యాంగులు, వృద్థులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని వారు, మారుమూల ప్రాంతాల్లోని వారు, రేషన్ సరుకుల కోసం ఏ ఇబ్బంది పడకుండా చేసిందని గుర్తు చేశారు.