Spiritual28th Jan 12:47 PMSunil Byrisetty1 min read

దారులన్నీ వనదేవతల చెంతకే- కోలాహలంగా మేడారం

బుధవారం ప్రారంభమైన మేడారం వనజాతర 4 రోజుల పాటు జరగనుంది. సారక్క ఆగమనంతో మహాజాతర మొదలు కానుంది. ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రం సారలమ్మ, ప

దారులన్నీ వనదేవతల చెంతకే- కోలాహలంగా మేడారం
బుధవారం ప్రారంభమైన మేడారం వనజాతర 4 రోజుల పాటు జరగనుంది. సారక్క ఆగమనంతో మహాజాతర మొదలు కానుంది. ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. జంపన్నవాగులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహా జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం రూ.251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలోవిధులు నిర్వహిస్తున్నారు.
Telangana News
Devotees Rush
Jampanna Vagu
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Tribal Festival
జంపన్నవాగు
నిలువెత్తు బంగారం
మేడారం మహాజాతర
Scroll for the next article