Politics20th Jun 04:37 PMSunil Byrisetty1 min read

పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర

పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యునికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్య పర్చడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహాకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అద్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. భారత ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ప్రక్రియకు సంబందించిన సమాచారాన్ని పలు వెబ్ సైట్ల ద్వారా పౌరులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. అధికారిక వెబ్‌సైట్: https://www.eci.gov.in/, SVEEP వెబ్‌సైట్: https://www.eci.gov.in/sveep-website తదితర వెబ్ సైట్లతో పాటు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తాజా సమాచారాన్ని వ్యాప్తి చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
Andhra Pradesh news
Commission of India
P. Pawan
democratic system
Media
పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర
Scroll for the next article